NEWSNATIONAL

మోడీ పాల‌న అభివృద్దికి న‌మూనా

Share it with your family & friends

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా

న్యూఢిల్లీ – సుస్థిర‌మైన ప్ర‌భుత్వం , స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడు ఈ దేశానికి అవ‌స‌ర‌మ‌ని 143 కోట్ల మంది భార‌తీయులు భావించార‌ని అదే భావ‌న‌తోనే ఇవాళ 17వ విడ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్బంలోనూ క‌నిపిస్తోంద‌ని చెప్పారు బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా.

శ‌నివారం 7వ విడ‌త పోలింగ్ కొన‌సాగుతోంది. ప‌లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో ప్ర‌జ‌లు ఓట్లు వేసేందుకు బారులు తీరారు. ఈ విడ‌త పోలింగ్ అత్యంత ముఖ్య‌మ‌ని చెప్పారు బీజేపీ చీఫ్‌. తాము ముందు నుంచీ చెబుతూ వ‌స్తున్నామ‌ని త‌మ‌కు 400 కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

మ‌రోసారి అభివృద్ది న‌మూనాతో ముందుకు వెళుతున్న మోడీ స‌ర్కార్ ను ప్ర‌జ‌లు దీవిస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మికి క‌నీసం 100 సీట్లు కూడా రావ‌న్నారు. ఇక కాంగ్రెస్ క‌ల‌ల్లో తేలి యాడుతోంద‌ని , వారి ఆశ‌లకు భంగం త‌ప్ప‌ద‌న్నారు జేపీ న‌డ్డా.