కేజ్రీవాల్ ను ఎవరూ నమ్మరు
స్వాతి మలివాల్ పై దాడి దారుణం
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన జాతీయ మీడియా ఏఎన్ఐ చీఫ్ ఎడిటర్ స్మితా ప్రకాష్ తో సంభాషించారు. స్వాతి మలివాల్ పై దాడి అబద్దమని, దీని వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆప్ చేసిన ఆరోపణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. అబద్దాలను నిజాలుగా భ్రమింప చేయడంలో అరవింద్ కేజ్రీవాల్ ను మించిన వ్యక్తి ఎవరూ లేరన్నారు.
తాము ఆప్ ను పార్టీగా పరిగణించడం లేదని చెప్పారు. తమతో ఆ పార్టీ పోటీ ఏంటి అంటూ ప్రశ్నించారు. తాము ఎందుకు స్వాతి మలివాల్ ను ఉపయోగించు కుంటామని నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమపై రాళ్లు వేయడం గత పది ఏళ్లుగా ఆప్ చేస్తూ వస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలు పాలై ఇటీవలే విడుదలైన కేజ్రీవాల్ ఇంతకంటే ఇంకేం చేయగలరని అన్నారు.
ఒక రకంగా కేజ్రీవాల్ ను, ఆ పార్టీని తాము పట్టించుకోమని స్పష్టం చేశారు జేపీ నడ్డా. అబద్దాల పునాదులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటైందని ధ్వజమెత్తారు.