ENTERTAINMENT

దేవ‌ర విజ‌యం తార‌క్ సంతోషం

Share it with your family & friends

మీ అభిమానానికి ఉప్పొంగి పోతున్నా

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ సినీ న‌టుడు, జూనియ‌ర్ ఎన్టీఆర్ అలియాస్ తార‌క్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ తో పాటు జాహ్న‌వి క‌పూర్, సైఫ్ అలీ ఖాన్ , ప్ర‌కాశ్ రాజ్ , శ్రీ‌కాంత్ త‌దిత‌రులు న‌టించిన దేవ‌ర చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న శుక్ర‌వారం విడుద‌లైంది. ఊహించ‌ని దానికంటే పెద్ద ఎత్తున జ‌నాద‌ర‌ణ పొందుతోంది ఈ చిత్రం.

ఆర్ఆర్ఆర్ చిత్రం సుదీర్ఘ కాలం త‌ర్వాత వ‌చ్చిన దేవ‌ర చిత్రం బిగ్ స‌క్సెస్ అందుకోవ‌డంపై స్పందించారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. త‌న ఆనందాన్ని పంచుకున్నారు. మాట‌లు రావ‌డం లేద‌న్నారు. తాను ముందే చెప్పిన‌ట్లు కాల‌ర్ ఎగ‌రేయ‌డం ఖాయ‌మ‌ని చెప్పాన‌ని ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అదే చేస్తున్నారంటూ తెలిపారు తార‌క్.

తాను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చిందని,.. మీ అపురూపమైన స్పందనలతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నానని పేర్కొన్నారు. ప్ర‌త్యేకించి పేరు పేరునా థ్యాంక్స్ తెలియ చేసుకుంటున్నాన‌ని తెలిపారు. ప్ర‌ధానంగా అద్భుత‌మైన క‌థ‌ను అందించినందుకు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు, సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద‌ర‌గొట్టిన అనిరుధ్ ర‌విచంద‌ర్, సినిమాటోగ్ర‌ఫీ ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీ‌క‌ర ప్ర‌సాద్ కు, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు జూనియ‌ర్ ఎన్టీఆర్.