ఆ 40 నిమిషాలు సినిమాకు హైలెట్
స్పష్టం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ – దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ కలిసి నటించిన దేవర చిత్రం ట్రైలర్ మంగళవారం విడుదలైంది. భారీ ఎత్తున ట్రెండింగ్ లొ కొనసాగుతోంది. లెక్కించ లేనంత మంది అభిమానులను కలిగి ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.
ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేయడంలో ముందుంటారు . తన తాత దివంగత ఎన్టీఆర్ తో కలిసి నటించిన దివంగత నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ , మనుమవడైన జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం విశేషం.
ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పేరు పొందిన ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు తన చిత్రం దేవర గురించి. ప్రధానంగా డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివను ప్రశంసలతో ముంచెత్తారు.
దేవర సినిమాకు సంబంధించి ఆఖరున ఉండే ఆ 40 నిమిషాలు కట్టి పడేస్తాయని స్పష్టం చేశారు జూనియర్ ఎన్టీఆర్. చాలా కసితో సినిమా తీశాడని, తను కేవలం నటుడిని మాత్రమేనని పేర్కొన్నారు. అభిమానుల అంచనాలకు మించి దేవర ఉంటుందని అన్నారు.