కొరటాల శివ దమ్మున్న దర్శకుడు
ప్రశంసించిన జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ముంబైలో భారీ అంచనాల మధ్య మంగళవారం దేవర చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ చూరగొంటోంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ అద్భుతమైన దర్శకుడు అంటూ కితాబు ఇచ్చారు. టేకింగ్ , మేకింగ్ లో తనదైన ప్రత్యేకత కలిగి ఉన్నారంటూ ప్రశంసించారు.
సినిమాకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావించారు జూనియర్ ఎన్టీఆర్. శివ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఆఖరున 40 నిమిషాలు మాత్రం దేవర మూవీకి హైలెట్ గా నిలవనుందని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.
ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు దేవరపై ఉన్నాయని పేర్కొన్నారు. కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశాడని, తాను కేవలం నటుడిగా తన పాత్రకు న్యాయం చేశానని అన్నారు.