త్వరగా కోలుకోవాలని పేర్కొన్న తారక్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్. గురువారం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది పూర్తిగా తనను షాక్ కు గురి చేసిందన్నారు. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా సైఫ్ అలీ ఖాన్ , జూనియర్ ఎన్టీఆర్ కలిసి డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర -1 మూవీలో నటించారు. ఇందులో హీరోగా తారక్ నటించగా ప్రతి నాయకుడిగా తొలిసారిగా పాన్ ఇండియా మూవీలో అద్భుతమైన ప్రతిభతో నటించి మెప్పించాడు. ఇద్దరికీ ఈ సినిమా గుర్తుండి పోయేలా పాత్రలను డిజైన్ చేశారు దర్శకుడు.
ఈ తరుణంలో తనకు మంచి స్నేహితుడని, తను దాడికి గురి కావడం పట్ల ఆందోళన చెందానని స్పష్టం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ సందర్బంగా సైఫ్ ఆరోగ్యం గురించి తన భార్య, ప్రముఖ నటి కరీనా కపూర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.