పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేపే తీర్పు
వెలువరించనున్న తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్ – పని చేస్తారని ఓట్లు వేసిన ప్రజలకు పంగనామం పెడుతూ కేవలం అధికారం కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, వారిని భవిష్యత్తులో ఎక్కడా పోటీ చేయకుండా చేయాలని కోరుతూ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో దాఖలైంది.
దీనిపై పలుమార్లు విచారణ చేపట్టింది కోర్టు ధర్మాసనం. చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తుది తీర్పు సెప్టెంబర్ 9న సోమవారం వెలువరించనుంది తెలంగాణ హైకోర్టు.
ప్రతి ఒక్కరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు.
వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని, మరోసారి ఎన్నికల్లో నిలబడకుండా చేయాలని పిటిషనర్ కోరారు. ఇదిలా ఉండగా భారత రాష్ట్ర సమితి పార్టీ పలు పిటిషన్లను దాఖలు చేసింది కోర్టు. పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు ఇప్పటి వరకు కొనసాగాయి. తుది తీర్పు వెలురించేందుకు సిద్దం అవుతోంది తెలంగాణ హైకోర్టు.