జోగులాంబ సన్నిధిలో ఎమ్మెల్యేలు
పూజలు చేసిన మంత్రి జూపల్లి
గద్వాల జిల్లా – దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆలయాలలో ఒకటి ఉమ్మడి పాలమూరు జిల్లా లోని ఆలంపూర్ లో వెలసిన శ్రీ జోగులాంబ అమ్మ వారి గుడి. శక్తి స్వరూపిణిగా పేరు పొందింది. ఇక్కడ జోగులాంబను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, ఆశించిన ఫలితాలు వెంటనే దక్కుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ప్రతి రోజూ వందలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి పోయింది. రాక్షస, రాచరిక పాలనకు ప్రజలు చరమ గీతం పాడారు. తమపై ఆధిపత్యం చెలాయిస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ , అక్రమాలకు పాల్పడిన నేతలను ఇంటికి సాగనంపారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
ఇదిలా ఉండగా తాము గెలుపొందేలా చేయడంలో ప్రజలతో పాటు జోగులాంబ అమ్మ వారి ఆశీస్సులు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రితో పాటు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తాజాగా సోమవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు అమ్మ వారిని దర్శించుకున్నారు.
వారిలో మంత్రి జూపల్లి కృష్ణా రావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సంపత్ కుమార్ , ఎమ్మెల్యే వంశీ కృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, తదితరులు పూజలు చేశారు.