స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జూపూడి ప్రభాకర్ రావు
అమరావతి – వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు నిప్పులు చెరిగారు. భారత దేశానికి దిక్సూచిగా నిలిచిన , దిశా నిర్దేశం చేసేలా రాజ్యాంగాన్ని తయారు చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఎవరు తాకినా లేదా విగ్రహాలను ధ్వంసం చేసినా ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు . ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు.
అంబేద్కర్ విగ్రహాన్ని తాకితే తమ మనో భావాలను తాకినట్టేనని అన్నారు. తమ ఆత్మ గౌరవాన్ని చంపినట్టేనని చెప్పారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే భారత రాజ్యాంగాన్ని తీసేయాలని ప్రయత్నించినట్టేనని పేర్కొన్నారు జూపూడి ప్రభాకర్ రావు.
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయబోయిన దొంగలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ విగ్రహం మీద చేయి వేస్తే ఆ చేయి తీసేసే రోజు తప్పకుండా వస్తుందని హెచ్చరించారు. ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా లేదా ఎంతటి స్థాయిలో ఉన్న వారైనా ఊరుకునేది లేదని అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి.