ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
ఢిల్లీ – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో ఆయన చేత ప్రమాణం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆయన 52వ సీజేఐ. అంతకు ముందు సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా పదవీ విరమణ పొందారు. ఇదిలా ఉండగా జస్టిస్ కె. బాలకిషన్ తర్వాత దళిత సామాజిక వర్గానికి చెందిన బీఆర్ గవాయి రెండవ వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. తాను పదవీ చేపట్టక ముందే తనకు చెందిన ఆస్తులను ప్రకటించారు గవాయి.
తన ముందు నుంచి ఆర్కిటెక్చర్ కావాలని అనుకున్నాడు. కానీ తన తండ్రి కోరిక మేరకు న్యాయవాది వృత్తిని స్వీకరించాడు. లాయర్ గా, న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు సీజేగా , ప్రస్తుతం సీజేఐగా ఆయన పదవులు నిర్వహించారు. ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు న్యాయమూర్తిగా సంచలన తీర్పులు వెలువరించారు.
ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. ఇప్పటికీ తాను నిరాడంబర జీవితాన్ని గడపాలని కోరిక ఉన్నట్టు చెప్పారు. తన తండ్రి అడుగు జాడల్లో నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి 2015లో దూరమయ్యాడు. ఆనాటి నుంచి నేటి దాకా కీలక తీర్పుల ద్వారా న్యాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ ఏడాది నవంబర్ వరకు సీజేఐ పదవిలో ఉంటారు. ఆ తర్వాత రిటైర్ అవుతారు. ఎలాంటి పదవులు అందుకోనని స్పష్టం చేశారు సీజేఐ గవాయి.