జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి రాజీనామా
సీజేఐ ఆదేశంతో తప్పుకున్న చైర్మన్
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. తను ఏరికోరి నియమించిన విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ఒక న్యాయమూర్తిగా మీడియా ముందు ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు.
మంగళవారం విద్యుత్ సంస్కరణలకు సంబంధించి చైర్మన్ తనను తప్పు పట్టడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. స్వయంగా ఈ కేసును విచారించారు జస్టిస్ చంద్రచూడ్. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యాయం చెప్పాలే తప్పా పక్షపాతంగా వ్యవహరించ కూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు వెంటనే కమిషన్ చైర్మన్, సభ్యులను మార్చాలని ఆదేశించారు. అంతే కాకుండా కొత్త వారిని వెంటనే నియమించాలని, కమిషన్ విధి విధానాలను ప్రకటించాలని, ప్రజలందరికీ తెలిసేలా చూడాలని స్పష్టం చేశారు సీజేఐ.
ఇదిలా ఉండగా సీజేఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు , రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి. న్యాయ వ్యవస్థపై గౌరవాన్ని కలిగి ఉన్నానని అందుకే వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు సీజేఐకి.