జస్టిస్ యశ్వంత్ వర్మ షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ – తన ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి తీవ్రంగా స్పందించారు జస్టిస్ యశ్వంత్ వర్మ . ఇదింతా తనపై కావాలని కుట్ర పన్నారని, తన ప్రతిష్టను దెబ్బ తీయడంలో భాగంగానే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎలాంటి నోట్ల కట్టలు బయట పడలేదన్నారు. ఇదిలా ఉండగా మార్చి 15ననే సీజేఐ దృష్టికి డబ్బుల విషయం వచ్చిందని తెలిసింది. జస్టిస్ వర్మకు మూడు ప్రశ్నలు వేసింది. ఆర్నెళ్ల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచించింది. తన మొబైల్ ఫోన్లను పారేయొద్దని, వాటిలో డేటా డిలీట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ. నోట్ల కట్టలు దొరికాయని పేర్కొనడం శుద్ద అబద్దమని మండిపడ్డారు. తాను అత్యంత నీతి నిజాయితీతో కూడిన న్యాయమూర్తినని పేర్కొన్నారు. కొందరు కావాలని తనపై కుట్రకు తెర లేపారని, అది త్వరలోనే తేలుతుందన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందన్నారు. తాను ఉన్నత స్థానంలో ఉంటూ ఇలాంటి అనుచిత పనులు ఎలా చేస్తానంటూ ప్రశ్నించారు జస్టిస్ యశ్వంత్ వర్మ.
మరో వైపు అగ్నిమాపక అధికారులు మాత్రం జస్టిస్ ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయట పడ్డాయని పేర్కొనడం కలకలం రేపింది. ఇదే అంశంపై రాజ్యసభలో కూడా చర్చకు వచ్చింది. తనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బార్ అసోసియేషన్. ఇది చెత్త బుట్ట కాదంటూ మండిపడింది.