దమ్ముంటే టీడీపీ భవన్ ను టచ్ చేయ్
కేటీఆర్ కు సవాల్ విసిరిన జ్యోత్స్న తిరునగరి
హైదరాబాద్ – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు జ్యోత్స్న తిరునగరి నిప్పులు చెరిగారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై భగ్గుమన్నారు. తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పట్ల చులకన చేసే రీతిలో కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ప్రధానంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదన్నారు. ఆమె సీరియస్ అయ్యారు. దమ్ముంటే టీడీపీ భవన్ ను టచ్ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు జ్యోత్స్న తిరునగరి.
ఇంకొక్కసారి టీడీపీ గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ, టీడీపీ భవన్ గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తమ పార్టీ కేవలం ప్రజల కోసం మాత్రమే పుట్టిందన్నారు. ఇకనైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.