ఉద్యోగులను మిలియనీర్లుగా మార్చిన బన్సాల్
యాప్ డైనమిక్స్ కంపెనీ ఓనర్ సంచలనం
హైదరాబాద్ – ఎవరీ జ్యోతి బన్సాల్ అనుకుంటున్నారా. భారతీయ సంతతికి చెందిన ఫౌండర్, యాప్ డైనమిక్స్ కంపెనీ ఓనర్. ఈ మధ్యనే అమెరికాలోని దిగ్గజ కంపెనీకి తన సంస్థను అమ్మేశాడు. అంతేనా తనకు వచ్చిన దాంట్లో ఇప్పటి వరకు తన కోసం పని చేసిన 400 మందిని మిలియనీర్లుగా మార్చేశాడు. దీంతో జ్యోతి బన్సాల్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
2017లో యాప్ డైనమిక్స్ పబ్లిక్ గా వెళ్లేందుకు కొన్ని రోజుల ముందు సిస్కో కంపెనీ రూ. 3.7 బిలియన్లకు కొనుగోలు చేసేందుకు జ్యోతి బన్సాల్ కు ఆఫర్ ఇచ్చింది. యాప్ డైనమిక్స్ కు ఫౌండర్ , చైర్మన్ గా ఉన్నాడు.
సిస్కో ఆఫర్ ను అంగీకరించడంతో తన కంపెనీలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు మిలియనీర్లుగా మారేలా చేశాడు. సంస్థ మెరుగైన ఫలితాలను సాధిస్తూ వస్తోంది. ఇందుకు తనతో పాటు పని చేస్తున్న ఉద్యోగుల శ్రమ దాగి ఉంది. ఈ సందర్బంగా తనకు వచ్చిన ఆదాయంలో కూడా వారికి కూడా భాగం ఉంటుందని స్పష్టం చేశాడు జ్యోతి బన్సాల్.
ఆయన చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏది ఏమైనా జ్యోతి బన్సాల్ తీసుకున్న ఈ నిర్ణయం ఎందరికో స్పూర్తి దాయకం కావాలని ఆశిద్దాం.