చంద్రబాబు స్పందిస్తే తప్పేంటి..?
టీడీపీ నాయకురాలు జ్యోష్ణ
హైదరాబాద్ – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు జ్యోత్స్న తిరుగనరి నిప్పులు చెరిగారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
జ్యోత్స్న తిరునగరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురు, శిష్యుల బంధం అంటూ కామెంట్ చేయడంపై ఫైర్ అయ్యారు. తమ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిందని చెప్పారు. స్వార్థ రాజకీయాలకు తెర లేపింది ఎవరో ప్రజలకు బాగా తెలుసన్నారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. పది ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన మీరు ఎంతగా విధ్వంసం చేశారో , ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో చూస్తే తెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారంటూ కామెంట్ చేయడం అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.
కుటుంబ పాలనకు కేరాఫ్ గా మారిన మీరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు జ్యోత్స్న తిరునగరి. ఆంధ్రా వాళ్లకు గేట్లు తెరిచారంటూ చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి చర్చిస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.