NEWSNATIONAL

ఎంకే స్టాలిన్ పై అన్నామ‌లై ఆగ్ర‌హం

Share it with your family & friends

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న పెట్టారు

త‌మిళ‌నాడు – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై కుప్పు స్వామి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ పాల‌నా ప‌రంగా చేత కాక కేంద్ర స‌ర్కార్ పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

నీతి ఆయోగ్ స‌మావేశానికి తాను హాజ‌రు కావ‌డం లేదంటూ చెప్ప‌డం ఎంత వ‌ర‌కు సబ‌బు అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే కేంద్రం దేశ అభివృద్ది ఎజెండాగా బ్జెట్ ను ప్ర‌వేశ పెట్టింద‌ని అన్నారు. బుధ‌వారం కె. అన్నామ‌లై మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రులు పాల్గొనే కార్య‌క్ర‌మానికి హాజ‌రైతేనే మ‌న రాష్ట్రానికి ఏం కావాలో ఏం తెచ్చుకోవాలో అనేది తెలుస్తుంద‌ని అన్నారు. ఎంకే స్టాలిన్ ముందు నుంచీ పూర్తిగా కేంద్రం ప‌ట్ల వ్య‌తిరేక‌మైన ధోర‌ణితో ఉన్నార‌ని ఆరోపించారు అన్నామ‌లై కుప్పు స్వామి.

ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాలు రాష్ట్రాల‌కు అంద‌డం లేద‌ని ఆరోపించ‌డం ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలి వేస్తున్నామ‌ని అన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన డీఎంకే ఎంపీలు ఎప్పుడైనా రాష్ట్రానికి సంబంధించి, త‌మ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి స‌మ‌స్య‌లు ఎత్తి చూపారా, ఏమైనా నిధులు కావాల‌ని అడిగిరా అని ప్ర‌శ్నించారు.