స్వామీ సదా స్మరామీ
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
తమిళనాడు – భారత దేశంలో అత్యున్నతమైన సామాజిక సేవా కార్యక్రమాలను అందిస్తున్న సేవా సంస్థలలో రామకృష్ణ మఠం ఒకటి. ఆధ్యాత్మిక పరంగా బోధనలు చేస్తూనే మనుషులతో మానవత్వపు విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తూ వస్తోంది.
ఇందులో భాగంగా రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఉచితంగా ఫలహారం, భోజన సదుపాయం ఆయా మఠాలలో నిత్యం పెడుతున్నారు. ఆకలి తీర్చడంలో కీలకంగా మారింది మఠంతో పాటు మిషన్.
ఇదిలా ఉండగా తాజాగా రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికయ్యారు స్వామి గౌతమానందజీ మహరాజ్. ఈ సందర్బంగా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు, అభినందనలు కురుస్తున్నాయి. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నామలై కుప్పు స్వామి. భారతదేశపు ఆధ్యాత్మిక గురువులు స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శారదా దేవి ప్రబోదాల వ్యాప్తిని నిస్సందేహంగా వ్యాప్తి చేయడంలో స్వామి గౌతమానందజీ మహరాజ్ కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ చీఫ్.