రాహుల్ గాంధీ ఓటమి ఖాయం
వాయనాడులో బీజేపీ గెలుపు తథ్యం
కేరళ – తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నామలై కుప్పు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. కేరళ లోని వాయనాడులో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఊహించని రీతిలో జనం హాజరయ్యారు. ఈ సందర్బంగా కె. అన్నామలై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
వాయనాడులో జనం మార్పు కోరుకుంటున్నారని, రాహుల్ గాంధీ ఈసారి పక్కా ఓడి పోవడమని జోష్యం చెప్పారు. ఎవరైనా సుస్థిరమైన , సమర్థవంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటారని చెప్పారు. ఇవాళ ఆ రెండింటిని అందించే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ తప్ప ఇంకేదీ ఈ దేశంలో లేదన్నారు.
దక్షిణాదిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాలి వీస్తోందని చెప్పారు కె. అన్నామలై. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే గతంలో లేని విధంగా ఇవాళ దేశం అన్ని రంగాలలో ముందుకు వెళుతోందని అన్నారు. ప్రపంచంలోనే టాప్ 5లో ఉండాలని మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఇందుకు మీరంతా తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.