కేరళలో బీజేపీ క్లీన్ స్వీప్
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
కేరళ – దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కుప్పు స్వామి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటించారు. కేరళ లోని తిరువనంతపురం, వాయనాడ్ లలో కె. అన్నామలై బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో మోదీ హవా కొనసాగుతోందన్నారు. తమిళనాడులో బీజేపీ హవా కొనసాగక తప్పదన్నారు. దేశానికి చెందిన 143 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు కె. అన్నామలై.
కేరళలో వామపక్ష పార్టీ పనై పోయిందన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేశారంటూ ఆరోపించారు కె. అన్నామలై కుప్పు స్వామి. దక్షిణాదికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో కాషాయ జెండా రెప రెప లాడడం ఖాయమని స్పష్టం చేశారు కె. అన్నామలై కుప్పు స్వామి.