తమిళనాట మోదీ ప్రభంజనం
కాషాయం విజయం తథ్యం
తమిళనాడు – సార్వత్రిక ఎన్నికల్లో తమిళ నాట భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేయ బోతోందని ఆ పార్టీ చీఫ్ కె. అన్నామలై కుప్పు స్వామి స్పష్టం చేశారు. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అరుదైన ఫోటోలను పంచుకున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో ప్రజలు గంప గుత్తగా బీజేపీకి ఓటు వేయబోతున్నారని తెలిపారు. ప్రత్యేకించి తమిళులు గతంలో ఎన్నడూ లేనంతగా మోదీని తమ కుటుంబ సభ్యుడిగా, సోదరుడిగా, కొడుకుగా భావించారని స్పష్టం చేశారు బీజేపీ చీఫ్ .
దేశ వ్యాప్తంగా ఉన్న 143 కోట్ల మంది భారతీయులు మూకుమ్మడిగా మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారని, గతంలో ఎన్నడూ లేని రీతిలో కేంద్రం తమిళనాడు అభివృద్ది కోసం భారీ ఎత్తున నిధులను మంజూరు చేసిందన్నారు. ఈసారి కూడా తమకు ఎదురే లేదని స్పష్టం చేశారు కె. అన్నామలై కుప్పు స్వామి.
తమకు 400 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.