పార్టీ పరంగా ఊహించని షాక్ ఇచ్చిన నేత
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన మార్పు చోటు చేసుకుంది. అధికారంలోకి రావాలని అనుకున్న బీజేపీకి ఊహించని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు కె. అన్నామలై. త్వరలోనే పార్టీ హైకమాండ్ కొత్త ప్రెసిడెంట్ ను నియమిస్తుందని ప్రకటించాడు. తదుపరి బీజేపీ రేసులో తాను లేనంటూ స్పష్టం చేశాడు. బీజేపీ నేతలు ఎవరూ పార్టీ పదవి కోసం పోటీ పడరంటూ పేర్కొన్నారు. ఈ సందర్బంగా తాను ఏ రేసులో లేనని చెప్పాడు. రాజకీయ పరిణామాల గురించి ఇప్పుడే స్పందించనంటూ తెలిపాడు.
కె. అన్నామలై మీడియాతో మాట్లాడారు. పార్టీ పరంగా తాను కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు కె. అన్నామలై. పార్టీ బలోపేతం కోసం ఎందరో కార్యకర్తలు, నాయకులు ప్రాణాలు అర్పించారని, వారందరికీ పేరు పేరునా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. తాను పార్టీ కోసం నమ్మకంతో , నిబద్దతతో పని చేస్తూ వచ్చానని అన్నాడు. ఇదిలా ఉండగా తనకు జాతీయ స్తాయిలో కీలక పదవి అప్పగించనున్నట్లు టాక్.