క్లీన్ స్వీప్ చేస్తామన్న అన్నామలై
తమిళనాడు – రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధానంగా పోటీ బీజేపీ వర్సెస్ డీఎంకే మధ్య నెలకొంది. మిగతా పార్టీలు బరిలో ఉన్నా ప్రధానంగా ఆయా పార్టీలకు చెందిన నేతల మధ్య నువ్వా నేనా అన్నంత రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది.
ఇదిలా ఎండగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. అన్నామలై కుప్పు స్వామి ప్రధాన ఆకర్షణగా మారారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఓ వైపు మోదీ ఇంకో వైపు అమిత్ షా జల్లెడ పడుతున్నారు. ఈసారి బీజేపీ ఎలాగైనా సరే భారీ ఎత్తున పాగా వేయాలని చూస్తోంది. ఈ మేరకు ట్రబుల్ షూటర్ ప్లాన్ వేస్తున్నారు. అన్నామలైకి దిశా నిర్దేశం చేస్తున్నారు.
తాజాగా రామనాథపురం లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన తమ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకేకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా తమిళనాడులో ఈసారి బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని జోష్యం చెప్పారు కె. అన్నామలై.