NEWSNATIONAL

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాదే హ‌వా

Share it with your family & friends

బీజేపీ చీఫ్ అన్నామ‌లై కుప్పు స్వామి

బెంగ‌ళూరు – దేశంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు త‌మిళ‌నాడు రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై కుప్పు స్వామి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ద‌క్షిణాదిపై ఫోక‌స్ పెట్టారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్ పూర్త‌యింది. కోయంబ‌త్తూరు నుంచి ఎంపీగా బ‌రిలో నిలిచారు కె. అన్నామ‌లై.

బీజేపీ హై క‌మాండ్ కీల‌క‌మైన యువ నాయ‌కుడిగా గుర్తింపు పొందిన కుప్పు స్వామిని ప్ర‌చారం చేయాల‌ని ఆదేశించింది. దీంతో త‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ లేద‌ని నిరూపించారు బీజేపీ చీఫ్‌. ఇందులో భాగంగా క‌ర్ణాట‌క‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేపట్టారు. ఆయ‌న బెంగ‌ళూరులో ఎంపీ అభ్య‌ర్థి తేజ‌స్వి సూర్య‌కు మ‌ద్ద‌తుగా రోడ్ షోలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు అన్నామ‌లై కుప్పు స్వామి. దేశంలో మోదీ హ‌వా కొన‌సాగుతోంద‌న్నారు. త‌మ పార్టీకి అడ్డు లేద‌న్నారు. ఏ శ‌క్తి అడ్డ కోలేదంటూ ప్ర‌క‌టించారు . త‌మ పార్టీకి 400 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు.