లక్ష మెజారిటీతో గెలుస్తా
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
తమిళనాడు – తమిళనాడు చీఫ్ కె. అన్నామలై కుప్పు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లక్ష మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్కా దత్ తో బీజేపీ అధ్యక్షుడు సంభాషించారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తమిళనాడులో డీఎంకే పనై పోయిందన్నారు. వంశ పారంపర్య పాలనతో జనం విసిగి పోయారని చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోదీ జపం కొనసాగుతోందని అన్నారు కె. అన్నామలై కుప్పు స్వామి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తమిళనాట తొలిసారిగా క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు కె. అన్నామలై.
కేంద్రం మంజూరు చేసిన నిధులకు సంబంధించి ఇప్పటి వరకు సీఎం ఎంకే స్టాలిన్ లెక్కలు చెప్ప లేదన్నారు. అవినీతి, అక్రమాలకు డీఎంకే కేరాఫ్ గా మారి పోయిందని ఆరోపించారు. ఈసారి ఆ పార్టీని నామ రూపాలు లేకుండా చేయడం ఖాయమన్నారు. తమ పార్టీకి భారీ ఎత్తున జనం ఓట్లు వేయ బోతున్నారని చెప్పారు కె. అన్నామలై కుప్పుస్వామి.