డీఎంకే సర్కార్ కబ్జా చేస్తోంది
బీజేపీ చీఫ్ కె. అన్నామలై ఫైర్
తమిళనాడు – బీజేపీ చీఫ్ కె. అన్నామలై సీరియస్ కామెంట్స్ చేశారు. ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కార్ అక్రమంగా భూ కబ్జాకు పాల్పడుతోందని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తోక ముడిచిందన్నారు. దానిని తట్టుకోలేక బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు కె. అన్నామలై.
తమిళనాడులోని వడలూరులో అరుళ్తిరు వల్లలార్ స్థాపించిన సత్య జ్ఞానసభకు చెందిన స్థలాన్ని ఇంటర్నేషనల్ సెంటర్ పేరుతో డీఎంకే మళ్లీ ఆక్రమించిందని ఆరోపించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ప్రజలు ఇష్ట పూర్వకంగా విరాళంగా ఇచ్చిన భూమిలో 150 ఏళ్లకు పైగా అందరి ఆకలి తీర్చే మహత్తర కార్యం జరుగుతోందని చెప్పారు. ఏటా లక్షలాది మంది భక్తులకు జ్యోతి దర్శనం చేసుకుంటారని అన్నారు.
ఈ పరిస్థితిలో డీఎంకే అధికారంలోకి రాగానే అంతర్జాతీయ కేంద్రంగా పేర్కొంటూ సత్య జ్ఞాన సభకు చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. సత్య జ్ఞానసభకు చెందిన భూమిని మళ్లీ ఆక్రమించ కూడదని, సుమారు 30 ఎకరాల భూమిని పునరుద్ధరించాలని, లేదా మరెక్కడైనా ఏర్పాటు చేయాలని కోరామన్నారు
ఎన్నికల కారణంగా తాత్కాలికంగా విరమించుకుందని ఇప్పుడు తిరిగి మొదలు పెట్టిందన్నారు కె. అన్నామలై.