రాష్ట్రానికి చేసిన మోసం దారుణం
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నామలై కుప్పుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమ పార్టీ ఆఫీసును ముట్టడిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప్రకటించడాన్ని తప్పు పట్టారు. ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎప్పుడు ముట్టడిస్తారో ముందే చెబితే మంచిదన్నారు. ఎప్పుడు వస్తారో వచ్చే తేదీ, సమయం చెబితే వచ్చే వారికి 10 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు కె. అన్నామలై.
అలాగే తమిళులకు డీఎంకే, కాంగ్రెస్ చేసిన ద్రోహంపై పుస్తకాన్ని వచ్చిన వారందరికీ బహుమతిగా అందిస్తామన్నారు బీజేపీ చీఫ్. డీఎంకే, కాంగ్రెస్‌లు తమిళులకు ఎలా శత్రువులుగా ఉన్నాయో తెలిపే వీడియోను ఆ రోజు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించు కున్నామని ప్రకటించారు .
ముందుగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ముందుగానే తెలియ చేయాలని కోరారు. ఒక రకంగా ఆయనపై నిప్పులు చెరిగారు.