డీఎంకే నిరూపిస్తే తప్పుకుంటా
బీజేపీ చీఫ్ కె. అన్నామలై కుప్పుస్వామి
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై కుప్పుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎన్నడూ ఓటర్లను ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల కూటమి తనపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు తానేమిటో తెలుసన్నారు. తాను వారి గొంతుకగా గత కొంత కాలం నుంచి పని చేస్తున్నానని చెప్పారు.
విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నది అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అని, ప్రతిపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే అని సంచలన ఆరోపణలు చేశారు కె. అన్నామలై. ఒకవేళ తాను గనుక ఎవరినైనా లేదా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు నిరూపించ గలిగితే ఈ క్షణం నుంచే తాను ప్రత్యక్ష , పరోక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
నిరాధారమైన ఆరోపణలు చేయడం డీఎంకే చీఫ్ , సీఎం స్టాలిన్ కు అలవాటుగా మారిందన్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ హవా కొనసాగుతుందన్నారు. కర్ణాటకలో క్లీన్ స్వీప్ చేస్తామని, తెలంగాణలో టాప్ లో కి వస్తామన్నారు. ఇక ఏపీలో దుమ్ము రేపుతామని, తమిళనాడులో చుక్కలు చూపిస్తామని చెప్పారు కె. అన్నామలై కుప్పుస్వామి.