NEWSNATIONAL

డీఎంకే కార్య‌ద‌ర్శిపై ప‌రువు న‌ష్టం

Share it with your family & friends

దావా వేసిన బీజేపీ చీఫ్ కె. అన్నామ‌లై

త‌మిళ‌నాడు – భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మిళ‌నాడు అధ్య‌క్షుడు కుప్పు స్వామి అన్నామ‌లై నిప్పులు చెరిగారు. బుధ‌వారం ఆయ‌న చెన్నైలోని హైకోర్టుకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు కె. అన్నామ‌లై. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని , దానిని జ‌నం నుండి దృష్టి మ‌ర‌ల్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో డీఎంకే పార్టీ కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ భార‌తి త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, ఉద్దేశ పూర్వ‌కంగా త‌న‌ను డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారంటూ ఆరోపించారు అన్నామ‌లై కుప్పుస్వామి. త‌న గురించి చెడుగా ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించారంటూ వాపోయారు కుప్పుస్వామి అన్నామ‌లై. అందుకే తాను కోర్టును ఆశ్ర‌యించాన‌ని, ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశాన‌ని చెప్పారు. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారానికి తెర తీసిన డీఎంకే కార్య‌ద‌ర్శి భార‌తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టుకు విన్న‌వించిన‌ట్లు తెలిపారు కె. అన్నామ‌లై.