అభివృద్ది..సంక్షేమం బీజేపీ లక్ష్యం
బీజేపీ చీఫ్ కె. అన్నామలై కామెంట్స్
తమిళనాడు – రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఓ వైపు డీఎంకే కూటమి తరపున ఉదయనిధి స్టాలిన్ ప్రచారం చేస్తుండగా మరో వైపు యువ నాయకుడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై అన్నీ తానై నడిపిస్తున్నారు. ఎన్డీయే కూటమి మరోసారి పవర్ లోకి వస్తుందని స్పష్టం చేశారు ఈ సందర్బంగా శుక్రవారం తిరువళ్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో.
అభివృద్దికి..అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలని మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ అభ్యర్థికి చెందాలని సూచించారు కె. అన్నామలై. డీఎంకే అవినీతికి కేరాఫ్ గా మారి పోయిందన్నారు. సీఎం స్టాలిన్, కొడుకు ఉదయనిధి స్టాలిన్ లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇది సార్వత్రిక ఎన్నికల్లో రూఢీ కాబోతోందని జోష్యం చెప్పారు కె. అన్నామలై.
ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత దేశానికి సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారంటూ మోదీ పై ప్రశంసలు కురిపించారు. తమిళనాడులో కొలువు తీరిన డీఎంకే సర్కార్ అప్పుల కుప్పగా మార్చేసిందని ఆరోపించారు. పుట్టిన పిల్లలపై కూడా అప్పు భారం ఉందంటూ ఆవేదన చెందారు కె. అన్నామలై.