ఖాకీల తీరుపై అన్నామలై కన్నెర్ర
అడ్డుకునే ప్రయత్నం దారుణం
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కుప్పు స్వామి నిప్పులు చెరిగారు. ఖాకీలు అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఎన్నికల నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారంటూ ధ్వజమెత్తారు కె. అన్నామలై కుప్పు స్వామి.
తమ పార్టీ జాతీయ పార్టీ అన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. బలహీనమైన కారణాలు చూపించి తమ ప్రచారాన్ని అడ్డు కోవడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు బీజేపీ చీఫ్. ఇది పూర్తిగా అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకే జరిగిందని మండిపడ్డారు .
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో డీఎంకే సర్కార్ కు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు కె. అన్నామలై కుప్పు స్వామి. పోలీసు బలగాల అండ చూసుకుని డీఎంకే నేతలు రెచ్చి పోతున్నారంటూ ఫైర్ అయ్యారు. తమకు కూడా ఓ రోజు తప్పకుండా వస్తుందన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం తాము చేపట్టలేదని పేర్కొన్నారు.