NEWSTELANGANA

శ్రీ‌రాముడి పేరుతో బీజేపీ రాజ‌కీయం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఎంపీ కే కేశ‌వ రావు

హైద‌రాబాద్ – అయోధ్య లోని శ్రీ‌రాముడి పేరుతో భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ‌కీయం చేస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌సభ ప‌క్ష నాయ‌కుడు, ఎంపీ కే. కేశ‌వ రావు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఆ దేశంలో కోట్లాది మంది శ్రీ‌రాముడిని కొలుస్తార‌ని అన్నారు. వారికి ఎలాంటి అభిప్రాయాలు ఉండ‌వ‌న్నారు. కేవ‌లం భ‌క్తితో మాత్ర‌మే భావిస్తార‌ని కానీ ప్ర‌తీ దానిని బీజేపీ రాజ‌కీయం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ప్ర‌ధాన మంత్రి దేశ స‌మ‌స్య‌ల‌పై కాకుండా కేవ‌లం స్వంత ప్ర‌చారం కోస‌మే పాకులాడ‌టం భావ్యం కాద‌న్నారు. అంద‌రి వాడైన రాముడిని కొంద‌రికే ప‌రిమితం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు గాలికి వ‌దిలి వేశార‌ని, అయోధ్య గురించి పార్ల‌మెంట్ లో చ‌ర్చ పెట్టి తీర్మానం చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఇది పూర్తిగా త‌ప్పు..కానీ స‌భాప‌తికి ఆ హ‌క్కు ఉంటుందున్నారు.

తాము అభ్యంత‌రం తెలిపినా ప‌ట్టించు కోలేద‌ని కేశ‌వ‌రావు ఆరోపించారు.