సీఎం చంద్రబాబును కలిసిన సీఎస్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు సిఎస్ గా పని చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సీఎం చంద్రబాబు విజయానంద్ ను నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురికి కీలక పదవులు లభించేలా చూశారు.
1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్ ఇప్పటి వరకు ఎన్నో పదవులు చేపట్టారు. వాటికి వన్నె తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా తన ఉద్యోగ ప్రస్తానాన్ని ప్రారంభించారు.
1996 వరకు రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. 1996 నుండి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.1998 నుండి 2007 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు.
2007 నుండి 2008 వరకు ప్రణాళిక, కార్యక్రమాల అమలు రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2008 నుండి 2009 ఎపి ట్రాన్సుకో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశారు. అదే విధంగా 2016 నుండి 2019 వరకు ఎపి జెన్కో మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎపి ట్రాన్సుకో సిఎండిగా ద్వంద్వ పాత్రలను నిర్వహించారు.
2019 నుండి 2021 వరకు రాష్ట్రంలోని కీలకమైన ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు .2023 నుండి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ పని చేస్తున్నారు.
అంతేగాక ఇదే సమయంలో ఎపిపిసిసి, ఎపిఎస్పిసిఎల్, ఎన్ఆర్ఇడిక్యాప్, ఎపిఎస్ఇసిఎం ల చైర్మన్ గా కూడా అదనపు బాధ్యతలను కూడా నిర్వహించారు. అంతేగాక 2023-24 సంవత్సరానికి సదరన్ రీజనల్ పవర్ కమిటీ (SRPC) చైర్ పర్సన్‌గా కూడా విజయానంద్ పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024ను రూపొందించి నోటిఫై చేయడంలో విజయానంద్ కీలక పాత్ర పోషించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రాన్ని 160 గిగా వాట్లకు పైగా జోడించడం ద్వారా గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
పునరుత్పాదక శక్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రతిష్టాత్మక విధానం సుమారుగా రూ. 10,00,000 కోట్లు పెట్టుబడులను రాబట్టడం తోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 7, 50,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.