ప్రకటించిన కేఏ పాల్
విశాఖపట్టణం – ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు. కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని ఏకి పారేశారు. నారా లోకేష్ తన ముందు ఓ బచ్చా అంటూ ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాదా అంటూ ప్రశ్నించారు. ఎవరిని నమ్మించాలని ప్రయత్నం చేస్తారంటూ కేఏ పాల్ నిలదీశారు. తను ప్రపంచ శాంతి దూతనని, తన కోసం ఆయా దేశాలకు చెందిన ప్రెసిడెంట్ లు, ప్రధానమంత్రులు , సిఈవోలు వేచి చూస్తారని అన్నారు.
లోకేష్ కు గర్వం తలకెక్కిందని ఆరోపించారు. తన లాంటి వాడిని అపాయింట్ మెంట్ కావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు కేఏ పాల్. ఇక నటుడు పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు. జనసేన పార్టీని గంప గుత్తగా టీడీపీకి అమ్ముకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు . ప్రజలు పవన్ కళ్యాణ్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తాను విశాఖ నుంచి బరిలో ఉండడం ఖాయమని జోష్యం చెప్పారు.