NEWSTELANGANA

అవినీతి ప‌రుల‌కు అందలం ప్ర‌మాదం – పాల్

Share it with your family & friends

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిపై ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. ఆయ‌న రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గురువారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ఇవాళ గౌత‌మ్ అదానీని హొట‌ల్ లో ఎందుకు క‌లిశాడో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందులో సునీల్ కొనుగోలు ఎందుకు ఉన్నాడ‌ని ప్ర‌శ్నించారు కేఏ పాల్.

పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి మామూలోడు కాద‌ని, అతి పెద్ద అవినీతి తిమింగ‌లం అని మండిప‌డ్డారు. అంద‌రికీ టోపీలు పెట్ట‌డంలో ముందంజ‌లో ఉంటాడ‌ని ఎద్దేవా చేశారు. ఇలాంటి అవినీతి ప‌రులు, దొంగ‌లు, మోస‌గాళ్ల‌కు ఓటు వేయ‌డం వ‌ల్లే ఇలాంటి అక్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు కేఏ పాల్.

ఇలాంటి అక్ర‌మార్కుల‌కు, అవినీతి ప‌రుల‌కు ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌కు బుద్ది లేద‌ని మండిప‌డ్డారు ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు. మొత్తం వ్య‌వ‌స్థ మారాలంటే ముందు ప్ర‌జ‌లు మేలుకోవాల‌ని లేక పోతే మ‌రిన్ని ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు కేఏ పాల్.