బీఆర్ఎస్ పనై పోయింది
మాజీ డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్ – మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కడియం కావ్యతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో జంప్ కానున్నారు. ఏఐసీసీ, టీపీసీసీ నుంచి ఆహ్వానం అందిందని, ఇక బీఆర్ఎస్ లో భవిష్యత్తు అన్నది లేదని తేలి పోయిందన్నారు. తనతో పాటు ఇంకా చాలా మంది గులాబీని వీడేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు.
ఆ పార్టీకి భవిష్యత్తులో కూడా భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం లేదన్నారు. ఇక అలాంటి పార్టీలో ఎవరు ఉండేందుకు ఇష్ట పడతారని ప్రశ్నించారు. ఎవరైనా పరుగులు తీసే గుర్రాన్ని ఇష్ట పడతారని పడుకునే గుర్రాన్ని ఎవరూ లేవ దీసేందుకు ప్రయత్నం చేయరని హిత బోధ చేశారు కడియం శ్రీహరి.
ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. డిప్యూటీ సీఎం గా పని చేశారు. తాజాగా తన కూతురు డాక్టర్ కావ్యకు కేసీఆర్ వరంగల్ ఎంపీ సీటు కేటాయించారు. తీరా అంతా అయి పోయాక ఉన్నట్టుండి తాము పార్టీ మారుతున్నట్లు తండ్రీ కూతురు ప్రకటించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి చోటు చేసుకుంది.
ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. పొద్దున ఒకరు కాంగ్రెస్ లో చేరితే మరొకరు బీజేపీలో జంప్ అవుతున్నారు.