చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి
మాజీ డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్ – మాజీ డిప్యూటీ సీఎం , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కలకలం రేపింది. చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగా ముఖ్యమంత్రి అయ్యాడంటూ ఎద్దేవా చేశారు.
కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి తన పరిధిలోని 7 శాసన సభ నియోజకవర్గాలలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించు కోలేక పోయాడంటూ ఫైర్ అయ్యారు. అదృష్టం కొద్దీ సీఎం అయ్యాడని, ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసన్నారు కడియం శ్రీహరి.
ఆరు గ్యారెంటీల పేరు చెప్పి , మోస పూరితమైన వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చారని, త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ నిరాధారమైన ప్రచారం చేశారని, ఇదే తాజాగా జరిగిన ఎన్నికలలో తమ కొంప ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా కొట్టుకు పోతుందన్నారు కడియం శ్రీహరి.