NEWSTELANGANA

కేసీఆర్ మాకు ఓనర్‌షిప్ ఇవ్వలేదు

Share it with your family & friends

కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి నిప్పులు చెరిగారు. ఆయ‌న బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. త‌మ‌ను ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. పార్టీలో త‌మ‌కు ఓన‌ర్ షిప్ ఇవ్వ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అలాంటి పార్టీలో తాము ఇంక ఎందుకు ఉండాల‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు ఊరికే టికెట్ ఇవ్వ‌లేద‌న్నారు. త‌న‌కు క్యాడ‌ర్ తో పాటు బ‌లం కూడా ఉంద‌ని , అనుభవం తోడై ఉండ‌డంతో కేసీఆర్ సీటు ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌జ‌ల నుంచి ఎప్పుడైతే నాయ‌కులు దూర‌మవుతారో వారిని జ‌నం ప‌ట్టించు కోర‌న్నారు. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ లో జ‌రుగుతోంది ఇదేన‌ని పేర్కొన్నారు. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా మాట్లాడినా త‌మ‌పై బుర‌ద చ‌ల్లేముందు తాము ఏమిటో ఒక్క‌సారి చూసుకోవాల‌ని సూచించారు.

త‌మ‌పై లేని పోని ఆరోప‌ణ‌లు చేసే వాళ్లు కొంచెం జాగ్ర‌త్తగా మాట్లాడాల‌ని సూచించారు. ఆధారాలు లేకుండా విమ‌ర్శించడం మంచి ప‌ద్ద‌తి కాద‌ని స్ప‌ష్టం చేశారు క‌డియం శ్రీ‌హ‌రి. ఎవ‌రు ఏమిటో అనేది రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌ల‌ని అన్నారు. వారే త‌మ‌కు శిరోధార్యం అని ప్ర‌క‌టించారు .