NEWSANDHRA PRADESH

దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం

Share it with your family & friends

మాజీ మంత్రి కాకాణి వార్నింగ్

అమ‌రావ‌తి – మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన టీడీపీ స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అధికారంలోకి వ‌చ్చి కొన్ని రోజులు కూడా కాక ముందే ప‌నిగ‌ట్టుకుని వైసీపీ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌పై దాడులు కొన‌సాగిస్తున్నార‌ని ఆరోపించారు.

పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్ పార్టీ ఆఫీసులో కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల త‌ర్వాత నెల్లూరు జిల్లాలోని స‌ర్వే ప‌ల్లిలో విధ్వంసాలు మొద‌లు అయ్యాయ‌ని, దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో తెలుగుదేశం మూకలు చేసిన విధ్వసంతో నష్ట పోయిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుల ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాడులను కొనసాగిస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, ఆస్తులను హరిస్తూ అన్ని రకాల వాళ్లని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారని ఆరోపించారు.