పెన్షన్ దారులకు కంగ్రాట్స్ – కాకాణి
జగన్ రెడ్డిదే ఈ క్రెడిట్ అంతా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లను నేటి నుండి ప్రారంభించి, ఇంటి దగ్గరకే అందించాలన్న నిర్ణయం సంతోషకరమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. వై.యస్.జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చిన అనేక సంస్కరణలలో భాగంగా ప్రతి నెల 1వ తేదీ కల్లా పెన్షన్ దారుని ఇంటికే పెన్షన్ చేర్చడం ఒకటి అని తెలిపారు.
ఇలాంటి ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెట్టి భవిష్యత్తు ప్రభుత్వాలకు మార్గదర్శిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డిని అభినందించకుండా ఉండలేకపోతున్నానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తూ, ఇంటి దగ్గరకే పెన్షన్ అందించాలన్న ఆలోచనతో ముందుకు వెళ్లినా, కొన్ని ప్రాంతాల్లో వివిధ కారణాలతో పేదవాని ఇంటికి ఈ రోజు చేర్చలేక పోయినా, సమస్యలను అధిగమించి, భవిష్యత్తులో ప్రతి నెల 1వ తేదీకల్లా లబ్ధిదారుల ఇళ్లకే పెన్షన్ చేర్చగలరని ఆశిస్తున్నానని పేర్కొన్నారు..
జగనన్న ప్రవేశపెట్టిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, పెంచిన పెన్షన్లను నేడు అందుకున్న ప్రజలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు కాకాణి.