గాడి తప్పిన టీడీపీ పాలన – కాకాణి
ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం
నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఏపీ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సొల్లు కబుర్లు తప్పా చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పటి వరకు మాటలు తప్పా చేసింది ఏమీ లేదన్నారు. కాకాణి గోవర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ కూడా నెరవేర్చడం కుదరదని కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు నిర్వహించిన కాన్ఫరెన్స్ లో పరోక్షంగా సంకేతాలను ఇచ్చాడని అన్నారు. హామీల ఊసే లేదు..ఆచరణ ఇంకెక్కడ అని ప్రశ్నించారు కాకాణి గోవర్దన్ రెడ్డి.
ఆదాయం పెంచుకునే మార్గాలు ఏమిటో చెప్పగలరా అని నిలదీశారు నారా చంద్రబాబు నాయుడును. కలెక్టర్లతో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ మొక్కుబడిగా జరిగిందన్నారు. ఇక నారా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ ప్రస్తుతం బ్లడ్ బుక్ గా మారిందని మండిపడ్డారు మాజీ మంత్రి.
ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందన్నారు. ఇక ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత దాడులు, హత్యలు, మానభంగాలు, కేసులతో హోరెత్తుతోందని అన్నారు.