బాబు..పవన్ బలహీనులు
వారికంత సీన్ లేదన్న కాకాణి
నెల్లూరు జిల్లా – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం నెల్లూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ బలహీనమైన నాయకులంటూ ఎద్దేవా చేశారు. వారి వల్ల ఏమీ కాదన్నారు. వారు జగన్ రెడ్డిని తట్టుకోలేరన్నారు.
తాము కొట్టబోయే దెబ్బకు విలవిల లాడే రోజు తప్పకుండా వస్తుందన్నారు. జీరోలైన మిమ్మల్ని కూడినా…గుణించినా వచ్చేది జీరోనేనంటూ బాబు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పోటీ చేయటానికి అభ్యర్థులు దొరికితే…ప్రజలు మద్దతు పలికినట్లేనా అని ప్రశ్నించారు మంత్రి.
ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలో చూపించడానికి సంసిద్ధం అంటున్నావా బాబూ అంటూ మండిపడ్డారు కాకాణి. చంద్రబాబూ…నోరు అదుపులో పెట్టుకో..ఏదంటే అది మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
నీ ఉత్త పుత్రుడు, దత్త పుత్రుడు సొంత నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. సీబీఐ ఎంక్వైరీ వేయించుకో..నువ్వు కడిగిన ముత్యానివో…కాదో తేలి పోతుందన్నారు. బాబు ప్రసంగమంతా ఆత్మ స్తుతి, పర నింద తప్ప ఇంకేమీ లేదన్నారు.
ముందు చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి.