కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు డెన్ గా మార్చారు
ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్
విజయవాడ – ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు డెన్ గా మార్చారని అన్నారు.
ఆదివారం విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వైసిపి హయాంలో కాకినాడ పోర్ట్ లోకి రాష్ట్ర అధికారులు ఎవరూ వెళ్లకుండా కుట్ర చేశారని ఆరోపించారు. మూడేళ్లలోనే రూ. 45 వేల కోట్ల విలువైన కోటి 31 లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని మండిపడ్డారు.
ఇంత భారీ దోపిడీ జరిగింది కాబట్టి తాము కాకినాడ పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు నాదెండ్ల మనోహర్. . ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ , జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ , రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కేకే , జనసేన పార్టీ డాక్టర్ సెల్ హెడ్ డాక్టర్ గౌతమ్ పాల్గొన్నారు.