కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గడువు పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ గడువు ఫిబ్రవరి వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ నెల 31 వరకే కమిషన్‌కు గడువు ఉండటంతో మరో రెండు నెలలు గడువు పెంచినట్లు తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచుతూ శనివారం సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆర్థిక, నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులను విచారిస్తోంది కమిషన్. ఈ కమిషన్ కు రేవంత్ రెడ్డి సర్కార్ రిటైర్డ్ జడ్జిని నియమించింది. ఇప్పటికే రంగంలోకి దిగింది. పలువురిని విచారణ నిమిత్తం పిలిపించింది.
ఇందులో భాగంగా గత భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిధులు, చోటు చేసుకున్న అవినీతి నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగారు రిటైర్ జడ్జి. నిన్న మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ను విచారించింది.