మే 28వ తేదీ వరకు ఘనంగా కార్యక్రమాలు
తిరుపతి – టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కలిగిరి కొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 28వ తేదీ వరకు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.30 గం.ల వరకు ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వేదారంభం, హారతి జరుగనుంది.
ఇందులో భాగంగా మే 24వ తేదీ ఉదయం 09 గం.ల నుండి 12 గం.ల వరకు యాగశాల వాస్తు, అకల్మష హోమం, రక్షాబంధనం, సాయంత్రం 06 నుండి 8.30 గం.ల వరకు అగ్ని ప్రతిష్ట, కళాకర్షణ, ఉక్త హోమాలను నిర్వహించనున్నారు. మే 25వ తేదీ ఉదయం 09 గం.ల నుండి 12 గం.ల వరకు పంచగవ్యాదివాసం, క్షీరాధి వాసం, యాగశాల వైదిక కార్యక్రమాలు, హారతి , సాయంత్రం 6 గం.ల నుండి 8.30 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు, హారతి జరుగనుంది.
మే 26వ తేదీ ఉదయం 09 గం.టల నుండి 12 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు, రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన శిఖర స్థాపన, బింభస్థాపన, అష్టబంధన, ద్రహ్యారాధన సమర్పణ, హారతి, సాయంత్రం 06గం.ల నుండి 8.30 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమములు, హారతిని నిర్వహించనున్నారు. మే 27వ తేదీన ఉదయం 09 గం.ల నుండి 12 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు, బింభవాస్తు, చతుర్థశ నవకలశ స్థాపన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, హారతి, సాయంత్రం 06 నుండి 8.30 గం.ల వరకు మహాశాంతి హోమాలు, పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం, శయనాది వాసం, హోత్ర ప్రశంసనము, విశేష హోమాలు జరుగనున్నాయి.
మే 28వ తేదీన 05 గం.ల నుండి 06.15 గం.ల వరకు సుప్రభాతం, యాగశాల వైదిక కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, యంత్రదానం, కుంభ ప్రదక్షణ, ఉదయం 07 గం.ల నుండి 07.30 గం.ల వరకు కళావాహన, ఆరాధన, బ్రహ్మఘోష, యజమాన ఆశీర్వచనం, ఆచార్య బహుమానం, ధ్వజారోహణం, హారతి , సాయంత్రం 04 గం.ల నుండి 07 గం.ల వరకు కళ్యాణోత్సవం, తిరువీధి ఉత్సవం, ధ్వజావరోహణం జరుగనుంది.