అశ్వ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి
కల్కి అవతారంలో శ్రీ వేంకటేశ్వరుడు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
ఈనెల 12వ తేదీ శనివారం ఆఖరు రోజు. ఉత్సవాలలో ప్రతి రోజూ శ్రీ వేంకటేశ్వర స్వామి వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మలయప్ప స్వామి కల్కి అవతారం ధరించారు. అశ్వ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
తిరుమలలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజైన శుక్రవారం దివ్య అశ్వవాహనంతో వాహనసేవలు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు, అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం , తదితర అధికారులు పాల్గొన్నారు.