ENTERTAINMENT

క‌ల్కి మూవీకి స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Share it with your family & friends

స్పెష‌ల్ షో..టికెట్ల రేట్లు పెంచేందుకు ఓకే

హైద‌రాబాద్ – క‌ల్కి సినిమా నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌కు తీపి క‌బురు చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం. సినిమాను భారీ బ‌డ్జెట్ తో తీశారు చ‌ల‌సాని అశ్వ‌నీ ద‌త్. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో న‌టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంచ‌నాలు వున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన క‌ల్కి మూవీ ట్రైల‌ర్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌స్తున్నాయి.

ఎస్ఎస్ రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ త‌ర్వాత తెలుగు సినిమా ద‌ర్శ‌కుడు తీస్తున్న మోస్ట్ ఫేవ‌ర‌బుల్ మూవీ ఇది. ఇదిలా ఉండ‌గా తెలంగాణ స‌ర్కార్ మూవీ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా క‌ల్కి మూవీ స్పెష‌ల్ షోల‌ల‌కు టికెట్ల రేట్ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌.

పెంచిన ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. క‌ల్కి బెని ఫిట్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ. 377 కాగా మ‌ల్టి ప్లెక్స్ లో టికెట్ ధ‌ర రూ. 495 గా పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. ఇక రెగ్యుల‌ర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ. 265 , మ‌ల్టీ ప్లెక్స్ రూ. 413 గా ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా క‌ల్కి చిత్రంలో ప్ర‌భాస్ , దీపికా ప‌దుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ న‌టించారు.