జేఎంఎం గెలుపులో కల్పనా సోరేన్ కీలక పాత్ర
హేమంత్ సోరేన్ జైలుకు వెళ్లిన సమయంలో
జార్ఖండ్ – రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానికి పుల్ స్టాప్ పడింది. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ తిరిగి పవర్ లోకి వచ్చింది. ఇది ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోడీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా ఎన్ని కుట్రలకు తెర లేపినా చివరకు జేఎంఎం సత్తా చాటింది. ఆశించిన మేర ఫలితాలు అందుకుంది ఆ పార్టీ.
ఇదే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్ ను అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుంది. చివరకు జైలు పాలైన సమయంలో హేమంత్ సోరేన్ భార్య కల్పనా సోరేన్ అదర లేదు..బెదర లేదు. అప్పటి వరకు ఆమె అంటే ఎవరో జార్ఖండ్ లోని ప్రజలకు తెలియదు .
కానీ ఎక్కడా తగ్గలేదు. తన భర్తను రక్షించుకునేందుకు తను నానా తంటాలు పడ్డారు. కలిసి వచ్చిన పార్టీలతో ముందుకు వెళ్లారు. తన భర్తకు జరిగిన అన్యాయం గురించి ప్రజల వద్దకు వెళ్లి చెప్పే ప్రయత్నం చేశారు కల్పనా సోరేన్.
పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది. తను ముందుండి నడిపించింది. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేలా కృషి చేసింది . నైపుణ్యాలు, సామర్థ్యాల ద్వారా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది .
ఆమె లాంటి లక్షలాది మంది మహిళలు భారతదేశంలో ఉన్నారు, వారు నాలుగు గోడల వెనుక, తెలియని, ప్రతిభను వృధా చేస్తున్నారు, ఎందుకంటే వారికి వ్యవస్థలో స్థానం లేదు. మొత్తంగా కల్పనా సోరేన్ దేశంలోని కోట్లాది మంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.