ఏఐ కోర్సు కోసం యుఎస్ వెళ్లిన కమల్ హాసన్
వయసు 69 ఏళ్లు వచ్చినా పట్టు వదలని నటుడు
తమిళనాడు – పరిచయం అక్కర లేని అద్భుతమైన నటుడు, నిర్మాత కమల్ హాసన్. తమిళ సినీ రంగ చరిత్రలో ఏజ్ ఓ వైపు పెరుగుతూనే ఉన్నప్పటికీ ఇంకా తమలోని నటనకు మెరుగులు దిద్దుతూ ముందుకు సాగుతున్నారు. వారిలో తలైవా రజనీకాంత్ కాగా మరొకరు కమల్ హాసన్.
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో ప్రతీ రంగాన్ని డామినేట్ చేస్తోంది సదరు టూల్. దీనిని నేర్చుకునేందుకు కమల్ హాసన్ ఏకంగా అమెరికా వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సినీ రంగంలో.
కమల్ హాసన్ తాజా వయసు 69 ఏళ్లు. ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తపన తగ్గలేదు. ఆయన అమెరికాలోని టాప్ ఇనిస్టిట్యూట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చదవడానికి అమెరికాకు వెళ్లారు. ఓవైపు సినిమాలతో, మరోవైపు రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ అధునాతన టెక్నాలజీపై పట్టు సాధించేందుకు కమల్ వెళ్లారని సన్నిహిత వర్గాలు ఓ కోలీవుడ్ మీడియాకు తెలిపాయి.
90 రోజుల కోర్సు కాగా ఆయన 45 రోజులే హాజరు కానున్నారని సమాచారం. మొత్తంగా నూతన తరం కమల్ మాసన్ ను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది కదూ.