భారతీయ మూలాలు కలిగిన నేత
అమెరికా – ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు పెద్దన్న అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారీస్. ప్రస్తుతం యుఎస్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ సంచలన ప్రకటన చేశారు. తాను అధ్యక్ష రేసులో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన వారసురాలిగా కమలా హారీస్ ను నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం పోటీ రసవత్తరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ మరోసారి బరిలో నిలిచారు. ఆయనపై ఎన్నికల ప్రచారంలో భాగంగా హత్యా యత్నానికి గురయ్యారు. తృటిలో తప్పించుకున్నారు. బరాక్ ఒబామా తర్వాత నల్ల జాతికి చెందిన నాయకురాలిగా గుర్తింపు పొందారు కమలా హారీస్. ఆమె ఎవరో కాదు భారత దేశానికి చెందిన మూలాలు కలిగిన వ్యక్తి.
ఇదిలా ఉండగా గత రెండు శతాబ్దాలకు పైగా అమెరికన్ ఓటర్లు నల్ల జాతి అధ్యక్షుడిని ఎన్నుకున్నారే కానీ మహిళను ఎన్నుకోలేదు. అధ్యక్ష బరిలో నిలిస్తే కమలా హారీస్ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఎలా ముందుకు సాగుతుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. కమలా హారీస్ వయసు 59 ఏళ్లు.