నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా – అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కీలక ప్రకటన చేశారు. తన వారసురాలిగా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ ను ప్రకటించారు. నవంబర్ 5న అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు.
ఇక దేశ చరిత్రలో మహిళను అధ్యక్షురాలిగా ఇప్పటి వరకు ఎన్నుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈసారి జరగబోయే ఎన్నికలపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమలా హారీస్ తల్లిదండ్రుల మూలాలు భారత దేశానికి చెందినవి కావడం విశేషం.
అమెరికాలో అత్యధికంగా తెలుగు వారు ఉన్నారు. భారతీయులు ఎక్కువ శాతం వివిధ రంగాలలో కీలకమైన స్థానాలలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఐటీ , లాజిస్టిక్ కంపెనీలకు సీఈవోలు, చైర్మన్ లుగా ఇండియన్లే ఉండడం విశేషం.
మరో వైపు ట్రంప్ గనుక వస్తే అమెరికాలో హింసోన్మాదం తిరిగి కొనసాగే ఛాన్స్ ఉందంటూ ఇతర దేశాలు, ఇండియన్లు భయపడుతున్నారు. వలసవాదులను రానీయనంటూ ఇప్పటికే ప్రకటించారు. అమెరికా వారికే ప్రయారిటీ ఇస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు ట్రంప్.